RRB NTPC: రిక్రూట్‌మెంట్ బోర్డులు RRB NTPC పరీక్ష రాసిన వారికి పరీక్ష ఫీజు రీఫండ్‌ను ప్రారంభించాయి. CEN 01/2019లో హామీ ఇచ్చినట్లుగా, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CBT స్టేజ్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తోంది. అభ్యర్థులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో ఫీజు మొత్తాన్ని పొందుతారు. ఫీజు రీఫండ్ నోటీసులో వివిధ చెల్లింపు పద్దతులు ఇచ్చారు.
ఈ మేరకు ఆర్ఆర్బీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘CBT-1 కి హాజరైన అభ్యర్థులందరూ పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి వారి బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. వారి బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, IFSC కోడ్ అందించాలి. అయితే ఒకసారి బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత బ్యాంక్ వివరాలను సవరించడం సాధ్యం కాదు ”అని ఆర్ఆర్బీ నోటీసులో పేర్కొంది. RRB అధికారిక వెబ్‌సైట్లలో ‘అప్‌డేట్ బ్యాంక్ అకౌంట్ లింక్’ అందించనున్నారు. ఇది ఆగస్టు 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 31 వతేదీ 11.59 PM వరకు అందుబాటులో ఉంటుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు రీఫండ్‌కు వారి బ్యాంక్ ఖాతా వివరాలు అందించడానికి వారు గతంలో ఇచ్చిన ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కు ఆర్ఆర్బీ SMS, ఈ మెయిల్ లింకు రూపంలో పంపుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేయడంలో సమస్యలు ఎదురైతే అలాంటి వారు ఆర్ఆర్బీ హెల్ప్‌లైన్ సెంటర్లో సమస్యను పరిష్కరించుకోగలరు.
- 28.12.2020 నుంచి 31.07.2021 వరకు 7 (ఏడు) దశలలో, Computer based Test (CBT-1) మొదటి దశ ఆర్ఆర్బీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి అర్హులు.
- PwBD/ Female/ Transgender/ Ex-Servicemen అభ్యర్థులు, SC/ ST/ మైనారిటీ కమ్యూనిటీలు/ ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు పూర్తిగా(రూ.250) రీఫండ్ చేయనున్నారు. దరఖాస్తు రుసుముగా ₹ 500 చెల్లించిన ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ. 400 తిరిగి ఇవ్వనున్నారు.
- దరఖాస్తు అసంపూర్తిగా ఉన్న అభ్యర్థులు చెల్లించిన పరీక్ష రుసుము రీఫండ్ చేయరు. అంతేకాకుండా దరఖాస్తు తిరస్కరించబడిన వారికీ రీఫండ్ తిరిగి చెల్లించబడదు.
No comments:
Post a Comment