Sunday, 15 August 2021

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2021 | జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్ స్కోర్ ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 20 ఖాళీలను ప్రకటించింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్-CABS కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. ఏరోనాటికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఫెలోషిప్స్ మాత్రమే. రెండేళ్ల తర్వాత మరో రెండేళ్ల వరకు ఫెలోషిప్ పొడిగించే అవకాశం ఉంది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్-CABS సెంటర్‌లోనే ఫెలోషిప్ ఉంటుంది. ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

DRDO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 20

ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 2

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 5
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 9

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 1

మెకానికల్ ఇంజనీరింగ్- 3

DRDO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 9

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 30

విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి.

వయస్సు- 28 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

పరిశోధన చేయాల్సిన అంశాలు- ఏరోడైనమిక్స్, స్ట్రక్చరల్ డిజైన్ అనాలిసిస్, రాడార్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెట్వర్కింగ అండ్ డిస్‌ప్లే సిస్టమ్, మిషన్ కంప్యూటర్, థర్మల్, మేనేజ్‌మెంట్.

స్టైపెండ్- రూ.31,000 + హెచ్ఆర్ఏ

ఎంపిక విధానం- గేట్ స్కోర్, డిగ్రీ, పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా https://www.drdo.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

కెరీర్స్ సెక్షన్‌లో సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్-CABS ఫెలోషిప్ నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.

డీఆర్‌డీఓ సూచంచిన ఫార్మాట్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

దరఖాస్తు ఫామ్‌ను ఇదే వెబ్‌సైట్‌లో What's new సెక్షన్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు.

పూర్తి చేసిన దరఖాస్తుల్ని jrf.rectt@cabs.drdo.in మెయిల్ ఐడీకి చివరి తేదీలోగా పంపాలి.

దరఖాస్తు ఫామ్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ కూడా పంపాలి.


Monday, 9 August 2021

RRB NTPC: ఆర్ఆర్​బీ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త.. వారికి ఫీజు రీఫండ్

RRB NTPC: రిక్రూట్‌మెంట్ బోర్డులు RRB NTPC పరీక్ష రాసిన వారికి పరీక్ష ఫీజు రీఫండ్​ను ప్రారంభించాయి. CEN 01/2019లో హామీ ఇచ్చినట్లుగా, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CBT స్టేజ్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తోంది. అభ్యర్థులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో ఫీజు మొత్తాన్ని పొందుతారు. ఫీజు రీఫండ్ నోటీసులో వివిధ చెల్లింపు  పద్దతులు  ఇచ్చారు.

లక్షలాది మంది పోటీ పడే పరీక్షలలో ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ (RRB NTPC) పరీక్ష ఒకటి, ఇందులో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB లు) వివిధ స్థాయిల పరీక్షల ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టులలో ఖాళీలను భర్తీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. కాగా, ఇపుడు ఆర్​ఆర్​బీ పరీక్ష రాసిన అభ్యర్థులకు బోర్డు తీపి కబురు అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు RRB NTPC పరీక్ష రాసిన వారికి ఫీజు రీఫండ్​ను ప్రారంభించాయి. CEN 01/2019లో హామీ ఇచ్చినట్లుగా, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CBT స్టేజ్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తోంది. అభ్యర్థులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో ఫీజు మొత్తాన్ని పొందుతారు. ఫీజు రీఫండ్ నోటీసులో వివిధ చెల్లింపు  పద్దతులు  ఇచ్చారు. అభ్యర్థులు తమ సంబంధిత ఖాతాలలో రైల్వే NTPC ఫీజు రీఫండ్ అందుకోవడానికి బ్యాంకు వివరాలను సమర్పించాలి. చాలామంది ఏదైనా ఇంటర్​నెట్​​ సెంటర్​లో అప్లికేషన్​ ఫీజు చెల్లించి ఆర్​ఆర్​బీ పరీక్ష రాసి ఉంటారు. దీనిపై కూడా ఆర్​ఆర్​బీ క్లారిటీ ఇచ్చింది. ఒకే అకౌంట్​ నుంచి చాలా మంది ఆర్​ఆర్​బీ పరీక్ష ఫీజు చెల్లించారని, అటువంటి అభ్యర్థులు తాజాగా వారి వివరాలతో కొత్త బ్యాంకు ఖాతా ఇవ్వొచ్చని పేర్కొంది. రీఫండ్​ డబ్బులు తాజా అకౌంట్​కు పంపించబడుతాయని తెలిపారూ.

 ఈ మేరకు ఆర్​ఆర్​బీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘CBT-1 కి హాజరైన అభ్యర్థులందరూ పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి వారి బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. వారి బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, IFSC కోడ్ అందించాలి. అయితే ఒకసారి బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్​ చేసి సబ్​మిట్​ కొట్టిన తర్వాత బ్యాంక్ వివరాలను సవరించడం సాధ్యం కాదు ”అని ఆర్​ఆర్​బీ నోటీసులో పేర్కొంది. RRB అధికారిక వెబ్‌సైట్లలో ‘అప్‌డేట్ బ్యాంక్ అకౌంట్ లింక్’ అందించనున్నారు. ఇది ఆగస్టు 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 31 వతేదీ 11.59 PM వరకు అందుబాటులో ఉంటుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు రీఫండ్​కు వారి బ్యాంక్ ఖాతా వివరాలు అందించడానికి వారు గతంలో ఇచ్చిన ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కు ఆర్​ఆర్​బీ SMS, ఈ మెయిల్ లింకు రూపంలో పంపుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్​ చేయడంలో సమస్యలు ఎదురైతే అలాంటి వారు ఆర్​ఆర్​బీ హెల్ప్​లైన్​ సెంటర్​లో సమస్యను పరిష్కరించుకోగలరు.

-   28.12.2020 నుంచి 31.07.2021 వరకు 7 (ఏడు) దశలలో, Computer based Test (CBT-1) మొదటి దశ ఆర్​ఆర్​బీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి అర్హులు.

  • PwBD/ Female/ Transgender/ Ex-Servicemen అభ్యర్థులు, SC/ ST/ మైనారిటీ కమ్యూనిటీలు/ ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు పూర్తిగా(రూ.250) రీఫండ్ చేయనున్నారు. దరఖాస్తు రుసుముగా ₹ 500 చెల్లించిన ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ. 400 తిరిగి ఇవ్వనున్నారు.
  • దరఖాస్తు అసంపూర్తిగా ఉన్న అభ్యర్థులు చెల్లించిన పరీక్ష రుసుము రీఫండ్​ చేయరు. అంతేకాకుండా దరఖాస్తు తిరస్కరించబడిన వారికీ రీఫండ్ తిరిగి చెల్లించబడదు.

Thursday, 15 July 2021

Telangana job vacancy details - 2021

తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు 56,979

రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి అవకాశముందో ఆర్థిక శాఖ తేల్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 44,022, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, ఇతర సంస్థల్లో 12,957 కలిపి మొత్తం 56,979 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (డీఆర్‌) పోస్టుల భర్తీకి అవకాశముందని స్పష్టం చేసింది. 

ఈ మేరకు నివేదికను బుధవారం కేబినెట్‌కు సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండగా, అతి తక్కువగా సమాచార శాఖలో కేవలం నాలుగంటే నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇలా మొత్తం 28 శాఖల వివరాలను కేబినెట్‌కు సమర్పించగా, 8 ప్రభుత్వ శాఖల్లో 100కన్నా తక్కువ ఉద్యోగ ఖాళీలు చూపెట్టారు. 
సంక్షేమ గురుకులాల్లో పోస్టుల సంఖ్యను చూపెట్టినా, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు18 వేల పోస్టులను మాత్రం నివేదికలో ప్రస్తావించలేదు.

కానిస్టేబుళ్ల పోస్టులు 19,251
పోలీసు శాఖలో 21,507 డీఆర్‌ పోస్టులు నింపేందుకు అవకాశముందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో 88 డీఎస్పీ (సివిల్‌), 368 ఎస్‌ఐ (సివిల్‌), 19,251 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీకి అవకాశం ఉందని తెలిపింది. అలాగే 515 ఫైర్‌మెన్, 380 ఎస్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు, 174 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది

సంక్షేమ గురుకులాల్లో 7,701 పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ పరిధిలో 3,400, ఎస్సీ గరుకుల సొసైటీలో 1,784, ఎస్టీ గురుకులాల్లో 1,124, మైనార్టీ గురుకులాల్లో 1,393 పోస్టులు చూపెట్టారు.

వైద్య శాఖ విషయానికి వస్తే 3,353 స్టాఫ్‌ నర్సులు, 1,216 ఏఎన్‌ఎంలు, 1,085 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అవకాశముంది. ఉన్నత విద్యలో 1,062 డిగ్రీ లెక్చరర్లు, 900 వరకు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులున్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. రెవెన్యూ శాఖ విషయానికి వస్తే 305 ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు, 59 ఏసీటీవోలు, 48 సీటీవోలు, 169 జూనియర్‌ అసిస్టెంట్లు (పన్నుల శాఖ), 210 మంది డిప్యూటీ సర్వేయర్లు, 50 డ్రాఫ్ట్‌మెన్, 42 డిప్యూటీ కలెక్టర్లు, 95 నాయబ్‌ తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 894 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, 121 ఎంపీడీవోలు, 195 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల భర్తీకి అవకాశముంది. నీటì పారుదల శాఖలో 721 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, 221 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు, 184 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు, అటవీశాఖలో 856 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు గ్రేడ్‌–1 కింద 181, గ్రేడ్‌–2 కింద 433 ఖాళీలున్నాయి. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారులు 200, పశువైద్య విభాగంలో 244 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లు, 103 వెటర్నరీ అసిస్టెంట్‌లు, రవాణా శాఖలో 108 మంది అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ వెల్లడించింది.