Thursday, 4 August 2022

Current Affairs 5th Aug - UPSC/SSC/TSPSC /GROUPs/Railways/other competitive examination

ఈ నెల Aug 26న సీజేఐ హోదా నుంచి  ఎన్వీ రమణ  పదవీ విరమణ చేయనున్నారు.
105 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. Aug 5th 2022 రోజున OU యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం జరగనుంది. 
యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణకు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.
గవర్నర్ తమిళసై యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఈ పురస్కారం ప్రధానం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇదే తొలి డాక్టరేట్ కావటంతో ఈ సారి ప్రత్యేకత. అది సీజేఐ అందుకోబోతున్నారు. 
జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టుకు 48వ చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి అందిస్తున్న 48వ డాక్టరేట్ కావటం మరో ప్రత్యేకత.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ (Justice UU Lalit) పేరును కొలీజియం సిఫార్సు చేసింది.